రాష్ట్రపతి, ప్రధానితో గవర్నర్ భేటీ

రాష్ట్రపతి, ప్రధానితో గవర్నర్ భేటీ
  •     ఇద్దరికీ కరీంనగర్​ సిల్వర్​ ఫిలిగ్రీ బహూకరణ

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్ సిల్వర్​ ఫిలిగ్రీ(నెమలి బొమ్మలు)ని వారికి బహూకరించారు. రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి శివప్రతాప్ శుక్లా ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్ లో ప్రెసిడెంట్ ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. 

దాదాపు 20 నిమిషాలకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, ఇతర రాజ్యాంగపర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అనంతరం ప్రధాని మోదీని కలిసి, గవర్నర్ గా తనకు అవకాశం కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, రాష్ట్రంలోని రాజకీయ, ఇతర అంశాలపై చర్చించారు.