సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై

ఇవాళ సంక్రాంతి పండగ. తెలుగు రాష్ట్రాల ప్రజలంతా పండగ సంబరాల్లో మునిగి తేలుతున్నారు.పల్లెటూళ్లకు జనం క్యూ కట్టడంతో పచ్చని పల్లెలు పండగ వాతావరణంతో తొణికిసలాడుతున్నాయి.ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్. ప్రత్యేకంగా రైతులకు సంక్రాంతి విషెస్ తెలిపారు తమిళిసై.  కరోనా ఉన్న  నేపథ్యంలో అందరూ కోవిడ్ గైడ్ లైన్స్ ను పాటిస్తూ పండుగ చేసుకోవాలని కోరారు.  కరోనాను అడ్డుకోవాలంటే వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు .100 శాతం మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారని గవర్నర్ తెలిపారు. రెండో డోస్ కూడా అందరూ వేసుకోవాలని కోరారు. వచ్చే సంక్రాంతి  అందరం ఒమిక్రాన్, కరోనా లేని సంక్రాంతి చేసుకోవాలని తమిళిసై ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి ఇమ్యూనిటీ ఉన్న ఫుడ్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆమె ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సూచించారు.

మరోవైపు తమిళిసై తమ సంక్రాంతి పండుగను  చెన్నైలోని నివాసంలో జరుపుకుంటున్నారు. సోమవారం రోజు భోగి సందర్భంగా గవర్నర్ పాయసం చేశారు.   చెన్నైలోని తన ఇంట్లో  కుటుంబ సభ్యులతో కలసి సంబరాలు చేసుకున్నారు. సంప్రదాయబద్ధంగా పాయసం వండి.. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పండుగ సందర్భంగా అందరితో కాసేపు సరదాగా గడిపారు. సంక్రాంతి పండుగ మన సంప్రదాయానికి ప్రతిబింబిస్తుందన్నారు తమిళిసై. ప్రజలందరికీ పొంగల్ విషెల్ తెలిపారు. 

ఇవి కూడా చదవండి:

పండగపూట గుర్రమెక్కిన బాలయ్య

కోడి పందెంలో ఓడిన కోడి ధర ఎంతో తెలుసా..