మేడారంలో గవర్నర్ తమిళిసై

మేడారంలో గవర్నర్ తమిళిసై

తెలంగాణ అతిపెద్ద జాతర మేడారం ఘనంగా సాగుతోంది. భక్తులు, రాజకీయ ప్రముఖులు మేడారంకు తరలివస్తున్నారు. తాజాగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ఇవాళ మేడారం జాతరకు వెళ్లారు. హెలికాప్టర్‌లో ఆమె మేడారం చేరుకున్నారు. అనంతరం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. తులాభారం వేసిన తమిళిపై నిలువెత్తు బంగారం సమర్పించారు. గిరిజన ప్రజలందరికి సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే మేడారం గొప్ప గిరిజన జాతర అన్నారు. తాను ఈ జాతరకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా పోవాలని సమ్మక్క సారక్కలకు కోరుకున్నానన్నారు. తెలంగాణ ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ప్రార్థించానన్నారు. గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

మరోవైపు నాలుగు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం వన దేవతలైన సమక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు వనప్రవేశం చేయనున్నారు. సమ్మక్కను చిలుకల గుట్టకు, సారాలమ్మను కన్నేపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజు ను పూనుగొండ్లకు సాగనంపనున్నారు. మంత్రులు మొదలుకొని ప్రభుత్వ యంత్రాంగం అక్కడే ఉండి మేడారం మహాజాతరకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా పటిష్టం చర్యలు తీసుకుంది. 

ఇవి కూడా చదవండి: 

సోనియా, రాహుల్‌కు జగ్గారెడ్డి

ఫిబ్రవరి 21న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్