హైడ్రా 111 జీవో పరిధిలోకి రాదు.. హైకోర్టుకు స్పష్టం చేసిన ప్రభుత్వం

హైడ్రా 111 జీవో పరిధిలోకి రాదు.. హైకోర్టుకు స్పష్టం చేసిన ప్రభుత్వం
  • రేపటి వరకు కూల్చివేయొద్దన్న కోర్టు
  • హైడ్రా ఏర్పాటు అభినందిస్తున్నట్టు వెల్లడి

హైదరాబాద్: హైడ్రా విధివిధానాలు ఏమిటని హైకోర్టు అడ్వొకేట్ జనరల్ ను ప్రశ్నించింది. జస్టిస్ లక్ష్మణ్​ బెంచ్ ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది.  ఏప్రాతిపదికన ఏర్పాటు చేశారని కోర్టు అడిగింది. దీనికి  స్పందించిన ఏజీ హైడ్రా 111 జీవో పరిధిలోకి రాదని పేర్కొన్నారు. ఈ సందర్బంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ హైడ్రా పేరిట హైడ్రామా క్రియేట్ చేస్తున్నారని అన్నారు.

ఆగస్టు 14న కొంత మంది అధికారులు జాన్వాడ ఫామ్ హౌస్ కి వచ్చి కూల్చివేస్తామని  బెదిరించారని తెలిపారు. హైడ్రా కమిషనర్ కు ఉన్న పరిమితులు ఏమిటని ప్రశ్నించింది హైకోర్టు.  నిర్మాణాలకు ఒక ప్రభుత్వ శాఖనే  అనుమతులు ఇస్తుంది, మరో శాఖ కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించింది. ఇదిలా ఉండగా హైకోర్టులో ఇంకా విచారణ కొనసాగుతోంది.