సరూర్ నగర్ జూనియర్ కాలేజీకి సర్కార్ నిధుల కేటాయింపు

సరూర్ నగర్ జూనియర్ కాలేజీకి సర్కార్ నిధుల కేటాయింపు

సరూర్ నగర్ జూనియర్ కాలేజీ విద్యార్థుల ఆందోళనకు ప్రభుత్వం, ఇంటర్ బోర్డు దిగొచ్చింది. కాలేజికి క్లాస్ రూమ్స్, కాంపౌండ్ వాల్, టాయిలెట్స్ కోసం నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సరూర్ నగర్ జూనియర్ కాలేజీతో పాటు తాండూర్ కాలేజీ సౌకర్యాల కోసం రూ. 2 కోట్ల నిధులను కేటాయించింది.

కాలేజీలో మౌలిక వసతులు, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇటీవలే ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీలో 400 మంది విద్యార్థినులు ఉంటే కేవలం ఒకే ఒక వాష్ రూమ్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 300 మంది బాయ్స్ విద్యార్థులకు వాష్ రూమ్స్ లేవని మండిపడ్డారు. కాలేజీకి వచ్చిన తర్వాత వాష్ రూమ్స్ కు వెళ్లకుండా టాబ్లెట్లు వేసుకుంటున్నారని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు  సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మద్దతు తెలిపారు. విద్యార్థులు పడుతున్న కష్టాలపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. వెంటనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్స్ వినిపించాయి.