ధాన్యం కొనుగోళ్లకు రూ.22,700 కోట్లు గ్యారంటీ

ధాన్యం కొనుగోళ్లకు రూ.22,700 కోట్లు గ్యారంటీ
  •     ఎంఎస్‌‌‌‌పీ ప్రక్రియకు ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: యాసంగి సీజన్‌‌‌‌లో ధాన్యానికి మద్దతు ధర చెల్లించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (మార్క్‌‌‌‌ఫెడ్) ద్వారా రూ.22,700 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వనుంది. వీటి కోసం వ్యవసాయ సహకార శాఖ జీవోఎంఎస్ నం.21 జారీ చేసింది. 

మార్క్‌‌‌‌ఫెడ్‌‌‌‌కు అదనపు కొనుగోలు సంస్థగా బాధ్యతలు అప్పగించి, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌‌‌‌సీడీసీ) నుంచి రూ.22,700 కోట్ల క్రెడిట్ సౌకర్యం పొందేందుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వ హామీతో తీసుకుని, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఖాతాకు బదిలీ చేసి రైతులకు చెల్లించనున్నారు.