మరో రిటైర్డ్​ ఐఏఎస్​ రీఅపాయింట్

మరో రిటైర్డ్​ ఐఏఎస్​ రీఅపాయింట్

హైదరాబాద్, వెలుగు: మరో రిటైర్డ్​ఐఏఎస్​ఒమర్​ జలీల్​ను రీఅపాయింట్ ​చేస్తూ రాష్ట్ర సర్కార్​ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను  ప్రభుత్వ కార్యదర్శి, మైనార్టీస్​ వెల్ఫేర్ కమిషనర్​గా నియమిస్తూ సీఎస్​ శాంతికుమారి మంగళవారం జీవో ఇచ్చారు.  ఒమర్ జలీల్ రెండేండ్ల పాటుఈ పోస్టులో కొనసాగనున్నారు. 

9 నెలల కిందటే ఒమర్​ జలీల్​ రిటైర్​అయ్యారు. ప్రస్తుతం మైనార్టీస్​ వెల్ఫేర్​ కమిషనర్​గా ఉన్న అహ్మద్​నదీమ్ ను​లేబర్ ​డిపార్ట్​మెంట్​ కమిషనర్​గా  బదిలీ చేశారు.