ఒకే ఆవరణలో ఉండే రెండు, మూడు స్కూళ్లను ఒకే స్కూల్​గా మార్చనున్న ప్రభుత్వం

ఒకే ఆవరణలో ఉండే రెండు, మూడు స్కూళ్లను ఒకే స్కూల్​గా మార్చనున్న ప్రభుత్వం

ఒకే ఆవరణలో ఉండే రెండు, మూడు స్కూళ్లను ఒకే స్కూల్​గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇలా ఉన్న మొత్తం 7వేలకు పైగా స్కూళ్లను విలీనం చేయాలని ప్రయత్నిస్తోంది. అయితే అధికారులు మాత్రం పర్యవేక్షణ, స్టూడెంట్స్​సౌలభ్యం కోసమేనని చెప్తున్నారు. రాష్ట్రంలో మొత్తం సర్కారు స్కూళ్లు 26,050 ఉండగా, వాటిలో 20.40 లక్షలకు పైగా స్టూడెంట్స్​ చదువుతున్నారు. ప్రభుత్వం గురుకులాల సంఖ్య పెంచుతున్న కొద్దీ, సర్కారు బడుల్లో స్టూడెంట్స్​ సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తక్కువ మంది ఉన్న స్కూళ్లలో ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.  దీంతో సాధ్యమైనన్నీ స్కూళ్లను కుదించాలని ప్రయత్నిస్తోంది. ఒకే ఆవరణలో రెండు, మూడు స్కూళ్లు ఉండేవి రాష్ట్రవ్యాప్తంగా 7,077 బడులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఒకే చోట హైస్కూల్, యూపీఎస్,  ప్రైమరీస్కూల్స్​ఉండగా, ఇంకొన్నిచోట్ల హైస్కూల్​తో పాటు రెండు ప్రైమరీ స్కూళ్లున్నాయి.