
హైదరాబాద్, వెలుగు: యాసంగి సీజన్‌లో 34 లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల నీళ్లు ఇవ్వాలనే ప్రతిపాద నలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 24 మేజర్, 34 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద యాసంగిలో 34.27 లక్షల ఎకరాల ఆయకట్టుకు 296.38 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని ఇరిగేషన్ ఇంజనీర్లు ఈనెల రెండో వారంలో ప్రతిపాదనలు పంపారు. 22.32 లక్షల ఎకరాల్లో ఆరుతడి, 11.95 లక్షల ఎకరాల్లో వరిసాగుకు ప్రాజెక్టుల నుంచి వారబందీ (ఆన్ అండ్ ఆఫ్) పద్ధతిలో నీరు విడుదల చేయనున్నారు.