LB స్టేడియంలో ఇఫ్తార్ విందు ఇచ్చిన రాష్ట్ర సర్కార్

LB స్టేడియంలో ఇఫ్తార్ విందు ఇచ్చిన రాష్ట్ర సర్కార్

రంజాన్ మాసం పూర్తి అవుతున్న సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందును ప్రభుత్వం తరపున ఇచ్చారు సీఎం కేసీఆర్. LB స్టేడియంలో జరిగిన ఈ విందులో CM KCRతో పాటు రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇతర నేతలు పాల్గొన్నారు. కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో 24గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మైనార్టీ సంక్షేమానికి బడ్జెట్ లో చాలా నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.