- పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి
- కేసీఆర్కు బీజేపీ స్టేట్ చీఫ్ లేఖ
- రైతులను పరామర్శించకుండా సభలంటూ తిరుగుతరా?
- కేసీఆర్కు బీజేపీ స్టేట్ చీఫ్ లేఖ
హైదరాబాద్, వెలుగు: ‘‘రాష్ట్రంలో వడగండ్ల వానలకు పంటలు నష్టపోయి రైతులు కన్నీళ్లు పెడ్తుంటే పట్టించుకోరా? కనీసం పరామర్శలకు పోరా? పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించాల్సిన మీ మంత్రులు, పార్టీ నేతలు ప్లీనరీ పేరుతో డ్యాన్సులు చేయడం సిగ్గుచేటు” అని సీఎం కేసీఆర్పై బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ ఫైర్ అయ్యారు. ‘‘ఇంతటి విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండి ధైర్యం చెప్పాల్సిన మీరు.. ఇతర రాష్ట్రాల్లో సభలు, సమావేశాలు అంటూ తిరుగుతరా? ఇదేనా మీరు చెబుతున్న రైతు ప్రభుత్వం. ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటదా?” అని మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కేసీఆర్కు సంజయ్ బుధవారం లేఖ రాశారు. సమగ్ర పంటల బీమా పథకం రూపొందించాలని డిమాండ్ చేశారు. ‘‘ప్రాథమిక అంచనా ప్రకారం అకాల వర్షాలతో 27 జిల్లాల్లో 4 లక్షలకు పైగా ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. దాదాపు లక్ష మందికి పైగా రైతులు నష్టపోయారు. మార్చిలో కురిసిన వర్షాలకు దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది” అని చెప్పారు. ‘‘మార్చి 23న మీరు కరీంనగర్ జిల్లా రామడుగులో పర్యటించి నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం వారంలోగా అందిస్తామని ప్రకటించారు. 2.28 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగిందని, పరిహారం చెల్లింపు కోసం రూ.228 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. రూ.150 కోట్లు విడుదల చేస్తూ ఈ నెల 19న ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో నయాపైసా కూడా జమ చేయలేదు” అని మండిపడ్డారు.
9 లక్షల ఎకరాల్లో పంట నష్టం..
ఈ యాసంగిలో 73 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయని సంజయ్ తెలిపా రు. ‘‘ప్రాథమిక అంచనా మేరకు గత 2 నెలల్లో కురిసిన వడగండ్ల వానలకు 9 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పంట నష్టం తేల్చే విషయంలో ప్రభుత్వ చర్యలు ఉదాసీనంగా ఉన్నాయి. గత 4 ఏండ్లలో పంట నష్టపోయిన రైతుల విషయంలో మీరు వ్యవహరించిన తీరు చూస్తే.. ముమ్మాటికీ మీది రైతు వ్యతిరేక ప్రభుత్వమని అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఫసల్ బీమా పథకం నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి పంట నష్టపోయిన రైతులకు నయాపైసా సాయం చేయలేదు. 2021–-22లో 19 లక్షల ఎకరాల్లో, 2020–-21లో 9 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి” అని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు పరిహారం చెల్లించాలని సంజయ్ డిమాండ్ చేశారు.
ఇయ్యాల కర్నాటకకు సంజయ్
కర్నాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొ నేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం ఉదయం బెంగళూ రు వెళ్లనున్నారు. కర్నాటకలోని చిక్ బల్లాపూర్, కొల్హార్ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేయనున్నారు. మూడ్రోజులపాటు సంజయ్ అక్కడే ప్రచారంలో పాల్గొం టారని రాష్ట్ర బీజేపీ నేతలు తెలిపారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ నేతలు లక్ష్మ ణ్, వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఇతర సీనియర్ నేతలు కర్నాటకలో పర్యటిస్తున్నారు.