ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు గైడ్ లైన్స్ విడుదల

ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు గైడ్ లైన్స్ విడుదల

టీఎస్ సెక్రటేరియట్: రాష్ట్రంలో ప్రయివేటు యూనివర్సిటీల ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఆ వివరాలు..

యూనివర్సిటీ పెట్టుకోవాలంటే అందుకు దరఖాస్తు ఫీజు 50 వేలు చెల్లించాలని తెలిపింది. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ 10 వేల చదరపు మీటర్లు ఉండాలని, 10 కోట్ల కార్బస్ ఫండ్ 30 కోట్ల ఫిక్స్డ్  డిపాజిట్ , 10 కోట్లు ఎండోమెంట్ ఫండ్ డిపాజిట్ చేయాలని తెలిపింది.

విద్యా శాఖ కార్యదర్శి ఎక్స్ ఆఫీషియో  చైర్మన్ గా ఆరుగురుతోని కమిటీ ఉంటుందని, ఆ కమిటేనే యూనివర్సిటీల దరఖాస్తులను పరిశీలిస్తోందని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి సిఫారసు చేయాల్సి  ఉంటుందని పేర్కొంది.

30 రోజుల్లోపు ఎక్స్ ఆఫీషియో కమిటీ రిపోర్ట్ పైన(యూనివర్సిటీ పెట్టుకోవాలా వద్దా అనే దానిపైన)  ప్రభుత్వం రిప్లై ఇవ్వాల్సి ఉంటుందని,.  ఫ్యాకల్టీ ,స్టూడెంట్స్ లలో మాత్రం కచ్చితంగా 25 % మంది తెలంగాణ వాళ్ళు అయి ఉండాలని గైడ్ లైన్స్ విధించింది. ఎవరైనా కనీసం రెండు ఏండ్ల పాటు తెలంగాణ లో నివసిస్తే తెలంగాణ వాళ్లుగా గుర్తించబడతారని ప్రభుత్వం గైడ్ లైన్సు లో తెలిపింది.