సర్కారీ లెక్చరర్లు, సిబ్బందికీ ఫేషియల్ అటెండెన్స్

సర్కారీ లెక్చరర్లు, సిబ్బందికీ ఫేషియల్ అటెండెన్స్
  • వెలుగు వార్తకు స్పందన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లు, ఇతర సిబ్బందికీ ఫేషియల్ అటెండెన్స్(ఎఫ్ఆర్ఎస్) పెట్టనున్నట్టు ఇంటర్మీడియెట్ కమిషనరేట్​ప్రకటించింది. ఈ నెల22న ‘సార్లకు బయోమెట్రిక్ తీసేసి.. స్టూడెంట్లకు ఫేషియల్ అటెండెన్స్’ హెడ్డింగ్​తో వెలుగులో వార్త ప్రచురితమైంది. స్టూడెంట్లకు పెట్టి, లెక్చరర్లకు పెట్టకపోవడం ఏంటని అధికారులపై సర్కార్ సీరియస్ అయింది. వెంటనే లెక్చరర్లకూ ఎఫ్ఆర్ఎస్​ అమలు చేయాలని ఆదేశించింది. 

దీంతో గురువారం ఇంటర్మీడియెట్ ఆర్జేడీ జయప్రదబాయి.. డీఐఈవోలు, నోడల్ అధికారులతో వర్చవల్​గా సమావేశం నిర్వహించి, లెక్చరర్లు, ఇతర సిబ్బందికీ ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. రిజిస్ర్టేషన్ల ప్రక్రియనూ స్టార్ట్ చేయాలన్నారు. ఇదే సమయంలో ‘వెలుగు’ కథనంపై ఇంటర్మీడియెట్ కమిషనర్ స్పందిస్తూ..  ఎడ్యుకేషన్​లో క్వాలిటీ పెంచేందుకు, డ్రాపౌట్స్ తగ్గించేందుకు ఫేషియల్ అటెండెన్స్ విధానం తీసుకొచ్చామని చెప్పారు.