
మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. త్వరలోనే మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ అందించాలని నిర్ణయించింది ప్రభుత్వం. మధురానగర్ లో మహిళా సహకార అభివృద్ధి సంస్థ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి సీతక్క ఈ మేరకు ప్రకటన చేశారు. జిల్లాల వారీగా దుర్గాభాయ్ మహిళ శిశు వికాస కేంద్రాల్లో కారు, ఆటో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మంత్రి సీతక్క. ఈ శిక్షణ కేంద్రాల ద్వారా మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఉచిత డ్రైవింగ్ శిక్షణతో పాటు.. ఫుడ్ ప్రాసెసింగ్, టైలరింగ్, బ్యూటీ థెరపీ, కంప్యూటర్ స్కిల్స్ వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చి, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు సీతక్క. ఈ శిక్షణ కార్యక్రమాల్లో స్వయం సేవ సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు సీతక్క.
18 నుంచి 45ఏళ్ళ లోపు మహిళలకు ఉపాధి కల్పించేలా చర్యలు చేపడుతున్నామని.. జిల్లా కేంద్రాల్లోని మహిళా కేంద్రాలను నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా మార్చాలని.. ఒక్కొక్క మహిళా కేంద్రాన్ని ఒక్కో రంగంలో శిక్షణ కోసం ఉపయోగించాలని అధికారులకు సూచించారు మంత్రి సీతక్క.