
- జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసుల యాక్షన్ ప్లాన్
- హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయం
- 22 ట్రాఫిక్ పీఎస్ ల పరిధిలో116 వాటర్ లాగింగ్ పాయింట్స్
సిటీ రోడ్లపై ప్రయాణమంటే అంత ఈజీ కాదు. రోజురోజు పెగిరిపోతున్న వాహనాలతో సిటీ రోడ్లపై ట్రాఫిక్ సమస్య కూడా పెరిగిపోతోంది. ఈ క్రమంలో వర్షాకాలంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు, -జీహెచ్ఎంసీతో కలిసి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నాయి. గతేడాది వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను ఇప్పటికే అధికారలు పునరుద్ధరించారు. బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి వాహనదారులను అలెర్ట్ చేసేలా ప్లాన్ చేశారు.
ఈ రూట్లలోనే ఎక్కువ సమస్య
సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 22 ట్రాఫిక్ పీఎస్‌ల పరిధిలో 116 వాటర్ లాగింగ్ పాయింట్స్ ను గుర్తించారు. రద్దీ ఎక్కువగా ఉండే ఎల్బీనగర్, లక్డీకపూల్, కూకట్ పల్లి రూట్లలో 59 ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలుస్తోందని గుర్తించారు. సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట-, మాదాపూర్, ఖైరతాబాద్, -మాసబ్‌ట్యాంక్, -మెహిదీపట్నం, -టోలిచౌకి-, గచ్చిబౌలి, ఉప్పల్, కోఠి, -బంజారాహిల్స్, -హైటెక్ సిటీ రూట్లలో 74 మేజర్ లాగింగ్ పాయింట్స్ ను గుర్తించారు.
మేజర్ లాగింగ్స్ తో
మేజర్ లాగింగ్ పాయింట్స్ లో చాదర్ ఘట్, పంజాగుట్ట మోడల్ హౌజ్, రాజ్‌భవన్‌రోడ్, గ్రీన్‌ల్యాండ్స్, అంబర్ పేట, రామంతాపూర్, ఆలుగడ్డబావి, బోయిన్ పల్లి, మారేడ్ పల్లి, బేగంపేట, మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నం, ఫిలింనగర్, షేక్‌పేట నాలా తదితర ప్రాంతాల్లో రోడ్లపై నిలిచే నీటితో ఏటా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షకాల నేపథ్యంలో విపత్తుల సమయంలో వినియోగించేందుకు వీలుగా రూ.17.50 లక్షల విలువైన వివిధ పరికరాలను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగానికి జీహెచ్ఎంసీ అందజేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దాన కిశోర్, సిటీ ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్ కు అంద చేశారు. జీహెచ్ఎంసీ విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, సైబరాబాద్ డీసీపీ విజయ్ కుమార్, జోనల్ కమిషనర్ శంకరయ్యలు పాల్గొ న్నారు. – హైదరాబాద్ , వెలుగు