మద్యానికి ఉన్న ప్రాధాన్యం విద్యకు ఎందుకు లేదు..?

మద్యానికి ఉన్న  ప్రాధాన్యం  విద్యకు ఎందుకు లేదు..?
  •   బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ

 ముషీరాబాద్, వెలుగు : విద్యతోనే అభివృద్ధి అని గొప్పలు పలికే ప్రభుత్వం విద్యపై సమీక్ష చేయకుండా మద్యం అమ్మకాలపై రివ్యూలు నిర్వహించడం సిగ్గుచేటని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ విమర్శించారు. బుధవారం విద్యానగర్​లోని బీసీ సంఘ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. చదువుతోనే దేశం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో విద్యార్థులకు అనేక ఆంక్షలు పెట్టి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్, కార్పొరేట్ వ్యవస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తూ అందలం ఎక్కిస్తుందని ఆరోపించారు. మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్​మెంట్ రూ.5వేల కోట్ల బకాయిలు ఉన్నా విడుదల చేయడం లేదని ఫైర్ అయ్యారు. తొమ్మిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్​ఒక్కసారి కూడా సమీక్షలతోపాటు విద్యా వ్యవస్థపై మీడియా ఎదుట మాట్లాడలేదన్నారు.