ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలి

ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలి
  • తెలంగాణ గౌడ సేవా సమితి  

ముషీరాబాద్,వెలుగు: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని గోల్కొండ కోటతో పాటు ట్యాంక్ బండ్ పైన పెట్టాలని తెలంగాణ గౌడ సేవా సమితి కోరింది. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సేవాసమితి రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. 

వ్యవస్థాపక అధ్యక్షుడు తోలుపునూరి రమేశ్​ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి గౌడ కులస్తులను ఐక్యం చేసి అభివృద్ధి దిశగా ముందుకెళ్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అరవింద్ గౌడ్, నరేష్ గౌడ్,రాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, జగన్ గౌడ్, సాయిబాబా గౌడ్, రవి వర్మ గౌడ్, సత్యం గౌడ్, బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.