
ఐటీ రంగంలో తెలంగాణ జాతీయ సగటుతో పోలిస్తే డబుల్ గ్రోత్ సాధించిందన్నారు మంత్రి కేటీఆర్. 2013 నుండి 2019 వరకు 400 రేట్ల వృద్ధిని సొంతం చేసుకుందని తెలిపారు. పెట్టుబడులకు హైదరాబాద్ అసలైన గమ్యస్థానమని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్నారు.
అయితే కరోనా అందరి జీవితాలను ,ఉపాధిని పరిశ్రమలను తీవ్రంగా దెబ్బ తీసిందన్నారు కేటీఆర్. లక్షలాది మంది వలస కూలీలు జాతీయ రహదారిపై నడవడం ఆవేదన కలిగించిందని తెలిపారు. భావోద్వేగా పూరిత సంవత్సరంగా ఈ సంవత్సరం నిలుస్తుందన్నారు. ఇన్ని ఇబ్బందుల మధ్య ఐటీ రంగం ఓ ఆషాకిరణంగా మారిందని..కేతిక ఆవిష్కరణలు ఎన్నో వచ్చాయన్నారు.
కరోనా సంక్షోభంలో ఐటీ కంపెనీలు 100 కోట్ల దాకా డోనేట్ చేసాయన్న మంత్రి కేటీఆర్…టెస్టింగ్ సెంటర్లు, వైద్య సమాగ్రీని సమకూర్చుకోవడంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయన్నారు. అంతేకాదు చాలా మంది ఆకలిని తీర్చాయన్నారు. ఐటీ పాత్ర ఇందులో చెప్పుకొదగ్గదని..అనుకోని సమయంలో వచ్చిన వరదలు ఇబ్బందులు గురి చేసాయన్నారు. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ పోచారం చేసిన సేవలు ప్రశంసనీయమని…ఐటీ విస్తరణను తూర్పు వైపు విస్తరించాలని కోరుతున్నట్లు తెలిపారు. దీన్ని ప్రోత్సహించడానికి లుక్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చామని..కంపనీలను ఎంకరేజ్ చేసేందుకు ఎన్నో రకాల ఇన్సెంటివ్ ఇస్తున్నట్లు తెలిపారు. వచ్చేవారంలో కొంపల్లిలో ఐటీ టవర్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్ . కరీంనగర్, వరంగల్ ద్వితీయ శ్రేణి నగరంలో ఐటీ కంపెనీలు పూర్తి స్థాయి సామర్థ్యంతో నడుస్తున్నాయని చెప్పారు.