తెలంగాణలో కరోనా టెస్టులు 19,278..ఇతర రాష్ట్రాల్లో లక్షల్లో..

తెలంగాణలో కరోనా టెస్టులు 19,278..ఇతర రాష్ట్రాల్లో లక్షల్లో..

వెలుగు సెంట్రల్​డెస్క్​మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో చాలా తక్కువ టెస్టులు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే టెస్టుల్లో వేగం పెంచాయి. రోజూ వేలల్లో టెస్టులు చేస్తూ పాజిటివ్​ వచ్చిన వారిని గుర్తిస్తున్నాయి. వాళ్లను ఐసోలేట్​ చేసి ట్రీట్​మెంట్​ చేస్తున్నాయి. ఈ జాబితాలో తమిళనాడు ముందు వరుసలో ఉంది. మొత్తం 2,02,436 టెస్టులు చేసింది. ఈ వారం రోజుల్లోనే 82,778 టెస్టులు చేసింది. రోజూ సగటున 11,825 టెస్టులు అయ్యాయి. మహారాష్ట్రలోనూ టెస్టులు 2 లక్షలకు దగ్గరగా ఉన్నాయి. 1.89 లక్షల టెస్టులను అక్కడి ప్రభుత్వం చేసింది. ఏపీ కూడా లక్షన్నర టెస్టులు చేసింది.

దేశంలో 14.37 లక్షల టెస్టులు

నిజానికి దేశంలో మొదట జరిగిన టెస్టులు చాలా తక్కువే. కిట్లు లేకపోవడం, విదేశాల నుంచి తెప్పించుకోవడం, వాటిలో లోపాలుండడం వంటి కారణాల వల్ల తక్కువ టెస్టులయ్యాయి. ఎక్కువగా చైనా టెస్టు కిట్ల మీదే ఆధారపడ్డాం. కానీ, వాటిలో లోపాలుండడంతో రెండు రోజుల పాటు వాటిని వాడొద్దని కేంద్రం రాష్ట్రాలకు రెండు వారాల క్రితం సూచించింది. అయితే, అంతకుముందు నుంచే ఇండియన్​ కంపెనీలు దేశీ టెస్ట్​ కిట్లపై దృష్టి పెట్టాయి. చాలా తొందరగానే తయారు చేశాయి. వాటికి ఇండియన్​ కౌన్సిల్​ ఫర్​ మెడికల్​ రీసెర్చ్​ (ఐసీఎంఆర్​) ఓకే కూడా చెప్పింది. అవి అందుబాటులోకి రావడంతో టెస్టుల్లో వేగం పెరిగింది. మునుపటికి, ఇప్పటికీ టెస్టుల సంఖ్యలో చాలా మార్పు వచ్చింది. వారం క్రితం వరకు దేశమంతా చేసిన టెస్టులు 8 లక్షలే అయితే, ఈ ఒక్క వారంలోనే 6,07,587 టెస్టులు చేసింది. సగటున రోజూ 86,798 టెస్టులు చేసింది. మొత్తంగా 14,37,788 శాంపిళ్లను టెస్టు చేశారు. డబ్ల్యూహెచ్​వో కూడా వీలైనన్ని ఎక్కువ టెస్టులు చేయాల్సిందిగా అన్ని దేశాలకూ సూచిస్తోంది. ఎన్ని టెస్టులు చేస్తే అన్ని ఎక్కువ కేసులు బయటపడే అవకాశముందని, కాబట్టి టెస్టులను ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని పదేపదే చెబుతోంది. అయినా, మన రాష్ట్ర సర్కార్​ టెస్టులపై నిర్లక్ష్యం చేస్తోంది.

ఏపీలో ఒక్కరోజే 7,320 టెస్టులు

  •     54 మందికి కరోనా పాజిటివ్
  •     1,887కు చేరిన కేసుల సంఖ్య

అమరావతి, వెలుగు: ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,887కు చేరింది. గడిచిన 24 గంటల్లో 7,320 శాంపిల్స్ టెస్టు చేయగా 54 మందికి పాజిటివ్ గా తేలిందని శుక్రవారం హెల్త్ డిపార్ట్ మెంట్ బులెటిన్ రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు   842 మంది డిశ్చార్జ్ కాగా 41 మంది మరణించినట్లు పేర్కొంది. 1,004 మందికి వివిధ హాస్పిటళ్లలో ట్రీట్ మెంట్ కొనసాగుతున్నట్లు తెలిపింది. గడిచిన 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 16, విశాఖపట్నం 11, పశ్చిమ గోదావరి 9, కృష్ణా 6, కర్నూల్‌‌ 7, చిత్తూరు 3, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు వెల్లడించింది.