తెలంగాణలో టెస్టులు పెరిగాయి..కేసులు పెరుగుతున్నాయి

తెలంగాణలో టెస్టులు పెరిగాయి..కేసులు పెరుగుతున్నాయి
  • మూడు రోజుల్లో సుమారు 690 మందికి పరీక్షలు
  • ఈ మూడు రోజుల్లో కలిపి 143 కేసులు నమోదు
  • మొత్తంగా 1,275కు చేరిన కేసుల సంఖ్య
  • మృతుల సంఖ్యను దాస్తున్నారనే ఆరోపణలు
  • మంత్రి కేటీఆర్‌‌ ‌‌కు ట్విట్టర్‌‌‌‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో మూడు రోజులుగా కరోనా టెస్టుల సంఖ్య పెరిగింది. ఆ మేరకు పాజిటివ్​ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. గత మూడు రోజుల్లో సుమారు 690 మందికి టెస్టులు చేయించగా.. 143 మందికి కరోనా ఉన్నట్టు తేలింది. ఇందులో శనివారం 31, ఆదివారం 33 కేసులురాగా.. సోమవారం ఒక్క రోజే కొత్తగా 79 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఏప్రిల్ 3న అత్యధికంగా 75 కేసులు నమోదుకాగా.. సోమవారం అంతకన్నా ఎక్కువగా వచ్చాయి. ఇక గత మూడు రోజుల్లో నమోదైన కేసుల్లో చాలా వరకు ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులే.ఏప్రిల్ మూడో వారంలో ప్రైమరీ కాంటాక్ట్స్​లో వైరస్​ లక్షణాల్లేని వారికి టెస్టులు చేయించడం ఆపేసిన సర్కారు.. ఇటీవలే నిర్ణయం మార్చుకుంది. లక్షణాలు లేకపోయినా ప్రైమరీ కాంటాక్ట్స్‌‌ అందరికీ టెస్టులు చేయించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు హోం క్వారంటైన్‌‌లో ఉన్న ప్రైమరీ కాంటాక్ట్  వ్యక్తులను దవాఖానాలకు తరలిస్తున్నారు. ఇలా గత మూడు రోజుల్లో నిజామియా, నేచర్ క్యూర్, సరోజిని దేవి కంటి దవాఖానాలకు 543 మందిని తరలించారు. మరి కొందరిని కింగ్‌‌ కోఠి హాస్పిటల్​కు తీసుకెళ్లారు. ఆయా హాస్పిటళ్లలో వీరి నుంచి శాంపిల్స్​ తీసి టెస్టులకు పంపారు. పాజిటివ్ వచ్చినవాళ్లను గాంధీ హాస్పిటల్​కు, నెగెటివ్ వచ్చిన వాళ్లను హోమ్‌‌ క్వారంటైన్‌‌ కు తరలిస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వస్తున్న వలస కార్మికుల్లో సింప్టమ్స్ ఉన్నవాళ్లకు కూడా టెస్టులు చేయిస్తున్నారు. దీంతో కేసుల సంఖ్య పెరుగుతోంది.

స్ట్రాటజీ మారిందిట్లా?

ఫిబ్రవరి ఆఖరు నుంచి రాష్ట్రంలో కరోనా టెస్టులు ప్రారంభమయ్యాయి. మొదట్లో పుణెకు శాంపిల్స్‌‌ పంపిన అధికారులు.. తర్వాత ఇక్కడే టెస్టులు చేయడం స్టార్ట్ చేశారు. విదేశాల నుంచి వచ్చినవాళ్లలో లక్షణాలున్న వారికి మాత్రమే టెస్టులు చేశారు. మర్కజ్ యాత్రికుల విషయంలో మాత్రం లక్షణాలున్నా, లేకున్నా వారికి, కుటుంబ సభ్యులు, క్లోజ్​ కాంటాక్ట్స్​కు చేశారు. ఏప్రిల్ మూడో వారం వరకూ అదే స్ట్రాటజీ అమలు చేశారు. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. తర్వాత లక్షణాలు లేనోళ్లకు టెస్టులు చేయడం ఆపేశారు. పాజిటివ్ వ్యక్తుల కుటుంబ సభ్యులైనా లక్షణాలుంటెనే టెస్టు చేయించారు. దీంతో టెస్టుల సంఖ్య, కేసుల సంఖ్య తగ్గిపోయింది. దీనిపై డాక్టర్లు, ప్రజాప్రతినిధులు సహా అన్ని వైపుల నుంచీ విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలో టెస్టుల సంఖ్య తక్కువగా ఉండడంపై కేంద్రం ఆరా తీసింది. దీంతో సర్కారు తన స్ట్రాటజీ మార్చుకుంది. లక్షణాలు లేకపోయినా టెస్టులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఫ్యామిలీకీ వైరస్​ అంటింది

ప్రైమరీ కాంటాక్ట్స్‌‌కు టెస్టులు బంద్ పెట్టిన సర్కారు.. వాళ్లందరినీ హోం క్వారంటైన్‌‌ లో పెట్టింది. వారిలో వైరస్​ లక్షణాలు లేకపోయినా ఒకే ఇంట్లో ఎక్కువ రోజులు ఉండడం వల్ల కుటుంబ సభ్యులకూ వైరస్​ వ్యాపించింది. ఈ పరిస్థితుల్లోనే ప్రైమరీ కాంటాక్ట్స్‌‌లో చాలా మందికి వైరస్ బయటపడుతోంది. ముందే టెస్టులు చేయించి ఉంటే.. ఇంతా కేసులు పెరిగేవి కాదని డాక్టర్లు కూడా అంటున్నారు. క్వారంటైన్‌‌లో ఉన్న కొందరు ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులు.. నిత్యవసరాల కోసం బయటికి వెళ్లినట్టుగా తమ దృష్టికి వచ్చిందని చెప్తున్నారు.

మరణాల లెక్కలు దాస్తున్నరా?

రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 30 మంది మరణించినట్టు సర్కారు ప్రకటించింది. చివరి మరణం ఈ నెల 9న నమోదైనట్టు పేర్కొంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన లెక్కకు, వాస్తవ లెక్కకు తేడా ఉందని.. కరోనా మరణాలను దాస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నెల 10న హైదరాబాద్‌‌ కు చెందిన ఓ వ్యక్తి కరోనాతో చనిపోయినా.. ఆరోగ్యశాఖ ప్రకటించిన బులెటిన్‌‌లో పేర్కొనలేదంటూ ఆదిత్య బెల్దే అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌‌‌‌ కు ట్వీట్ చేశారు. ‘మా బాబాయికి ఈ నెల 9న కరోనా పాజిటివ్ వచ్చింది. 10న ఆయన మరణించారు. మా కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్ చేశారు. కానీ పదో తేదీ నాటి బులెటిన్‌‌లో ఆ మృతి విషయం వెల్లడించలేదు..’ అని ఆ ట్వీట్​లో పేర్కొన్నారు. ఇక హైదరాబాద్‌‌లోని ఓల్డ్ సిటీకి చెందిన మరొకరు కూడా తన తల్లి విషయంలో ఇలాగే జరిగిందని చెప్పారు. కరోనాతో వారం పాటు ట్రీట్​మెంట్​ పొందిన ఆమె ఏప్రిల్ చివరి వారంలో చనిపోయిందని, హెల్త్​ బులెటిన్‌‌లో ఆ విషయం వెల్లడించలేదని, ఆమె డెత్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇక రెండ్రోజుల కింద సరూర్‌‌ ‌‌నగర్‌‌ ‌‌కు చెందిన ఓ మహిళ చనిపోయిందని, ఆమె విషయంలో కూడా ఇలాగే జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నయి. డయాలసిస్‌‌ పేషెంట్​ అయిన ఆ మహిళ భర్త ప్రస్తుతం గాంధీలో కరోనా ట్రీట్‌‌మెంట్ పొందుతున్నారని తెలిసింది.

సీఎం కేసీఆర్,జగన్ అన్నదమ్ములు