సీజనల్ వ్యాధులపై అలెర్ట్గా ఉండాలె

సీజనల్ వ్యాధులపై అలెర్ట్గా ఉండాలె

హైదరాబాద్ : వర్షాలతో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు డీహెచ్ శ్రీనివాసరావు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న  డీహెచ్.. కరోనా తగ్గాక డెంగీ కేసులు అధికంగా వస్తున్నాయన్నారు. దోమలు, అపరిశుభ్రవాతావరణంతో డెంగీ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.  నీరు, ఆహారం కలుషితమైతే విషజ్వరాలు వస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది డెంగీతో పాటు టైపాయిడ్ కేసులు పెరిగాయన్న  డీహెచ్.. రాష్ట్రవ్యాప్తంగా టైపాయిడ్, డెంగీ కేసులు ఎక్కువ వస్తున్నాయన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరి అన్నారు. మంచినీరు, ఆహారంపై దోమలు వాలకుండా ఉండాలని.. ఫ్రెష్ కూరగాయలు, వేడిగా ఉన్నప్పుడే తినడం మంచిదని సూచించారు.

సాధ్యమైనంతవరకు డ్రింకింగ్ వాటర్ వేడి చేసుకుని తాగితే చాలా మంచిదన్నారు. పానీపూరి, బయటి ఫుడ్ తినేటప్పుడు శుభ్రంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలన్నారు. చిన్న నొప్పులే కదా అని లైట్ తీసుకుని ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని.. జ్వరం వచ్చినప్పడు తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలని తెలిపారు. అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని.. దగ్గరిలోని సర్కార్ హాస్పిటల్ కి వెళ్లి ఫ్రీగా మంచి ట్రీట్ మెంట్ తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని అన్ని సర్కార్ హాస్పిటల్స్ లో సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.