తెలంగాణ హైకోర్టు న్యాయవాది కె. రాజారెడ్డి మృతి

తెలంగాణ హైకోర్టు న్యాయవాది కె. రాజారెడ్డి మృతి

హైదరాబాద్: సెరిబ్రల్ స్ట్రోక్(బ్రెయిన్ స్ట్రోక్) కారణంగా తెలంగాణ హైకోర్టు న్యాయవాది కె. రాజా రెడ్డి గురువారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన మృత‌దేహాన్ని అంత్య‌క్రియ‌ల నిమిత్తం శుక్ర‌వారం జూబ్లీహిల్స్ లోని మ‌హాప్ర‌స్థానానికి త‌ర‌లించారు. 84 ఏళ్ల రాజా రెడ్డి వరుసగా నాలుగుసార్లు (1974,1979,1984,1989) ఏపీ బార్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. 1979-84 వరకు బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా కూడా పనిచేశారు.

రాజారెడ్డి స్వ‌స్థ‌లం కరీంనగర్ జిల్లాచార్లా బూత్కూర్ గ్రామం. 1992 నుండి హైకోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన ఆయ‌న‌.. 1995 మరియు 1982 లో అసిస్ట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా కూడా పనిచేశారు. రాజా బహదూర్ వెంకట్ రామ్ రెడ్డి హాస్టల్‌కు సంయుక్త కార్యదర్శిగా మరియు బోర్డు సభ్యుడిగా చాలా సంవత్సరాలు ఆయన తన సేవలను అందించారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సెల్ ఇన్‌ఛార్జిగా కూడా రాజారెడ్డి ప‌నిచేశారు. 2000 సం. నుండి బీజేపీ తో సంబంధాలు క‌లిగి ఉన్న ఆయ‌న‌.. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లోనూ పాల్గొన్నారు. ఆయ‌న మృతికి ప‌లువురు సంతాపం వ్య‌క్తం చేశారు. బంధువులు, స్నేహితులు, న్యాయవాదులు, మంత్రి ఇంద్రకరన్ రెడ్డి, మాజీ మంత్రి ఎన్ రామ్‌కిషన్ రావు ఆయనకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.