వివేకా హత్య కేసు : గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన హైకోర్టు

వివేకా హత్య కేసు : గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన హైకోర్టు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో  కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఈ కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో ఎర్ర గంగిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడని ..అతను బయట ఉండటం వల్ల దర్యాప్తులో సహకరించడానికి ప్రజలు ఎవరూ ముందుకు రావడం లేదని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. విచారణ కీలక దశలో  ఉన్నప్పుడు అతడి బెయిల్ రద్దు చేయాలని హైకోర్టుకు వివరించింది.  

సీబీఐ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ,,  వచ్చే నెల మే 5లోపు హైదరాబాద్  సీబీఐ కోర్టు ముందు  లొంగిపోవాలని గంగిరెడ్డిని ఆదేశించింది.  సీబీఐ కోర్టులో లొంగిపోకపోతే అరెస్ట్ చేయవచ్చునని తెలిపింది. జులై 1న దర్యాప్తు పూర్తిచేసి గంగిరెడ్డి కి బెయిల్ మంజూరు చేయాలని సీబీఐ కోర్టుకు హైకోర్టు ఆదేశించింది.  లక్షన్నర షూరిటీలతో బెయిల్ ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా 2019 జూన్ 27న గంగిరెడ్డికి పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.