హైదరాబాద్, వెలుగు: కారుణ్య నియామకానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా కొత్త అంశాలతో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే అనుమతించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్‌లో కొత్త వాదనలను పరిగణనలోకి తీసుకోలేమని, అప్పీలుకు రివ్యూ ప్రత్యామ్నాయం కాదని పేర్కొంది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునే పరిస్థితులు లేవని చెబుతూ జలమండలి దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
హైదరాబాద్‌కు చెందిన పి. కవిత తల్లి మరణించడంతో కారుణ్య నియామకం కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని కారుణ్య నియామకంపై నిర్ణయం తీసుకోవాలని 2025లో జలమండలిని ఆదేశించింది. కాగా, ఆ ఉత్తర్వులను అమలు చేయకుండా జలమండలి రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
