పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు.. ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదుపై స్టే పొడిగింపు

పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు.. ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదుపై స్టే పొడిగింపు

హైదరాబాద్: పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఈ నెల 10వ తేదీవరకు స్టే పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ధరణి పోర్టల్ పై దాఖలైన పిటిషన్ పై   తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు విచారణ చేపట్టింది. ధరణి నిబంధనలకు సంబంధించిన 3 జీవోలపై న్యాయవాది గోపాల్ శర్మ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లపై విచార‌ణ చేసిన హైకోర్టు.. ధరణి జీవోల పై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ధరణి పోర్టల్‌ లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆపాలని, పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని హైకోర్టు సూచించింది. వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని ఏజీ కోరారు. మధ్యంతర ఉత్తర్వుల వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని ఏజీ తెలిపారు.