ప్రాజెక్ట్ లకు వేలకోట్లు ఖర్చుపెట్టే సర్కార్.. ఆర్టీసీకి 47 కోట్లు ఇవ్వలేదా..?: హైకోర్ట్

ప్రాజెక్ట్ లకు వేలకోట్లు ఖర్చుపెట్టే సర్కార్.. ఆర్టీసీకి 47 కోట్లు ఇవ్వలేదా..?: హైకోర్ట్

ఆర్టీసీ ఈడీల కమిటీ నివేదికలో నాలుగు ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి రూ.47 కోట్లు అవసరమని తేల్చిందని, అంత డబ్బు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు నిరాకరిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. వేల కోట్లు పెట్టి ఇరిగేషన్​ ప్రాజెక్టులు కడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల కోసం రూ. 47కోట్లు కూడా ఇవ్వలేదా అని వ్యాఖ్యానించింది. 50 వేల మంది కార్మికులకు సంబంధించిన ఆర్టీసీ సమ్మె విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోందని తెలిపింది. ఆర్టీసీ అంటే 48 వేల ఉద్యోగులు మాత్రమే కాదని, అది తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల సమస్య అని పేర్కొంది. సర్కార్‌‌ వైఖరి కారణంగా ప్రజల ఆశలు ఆవిరి అవుతున్నాయని, ఆశలకు ఊపిరి ఊదాలని సూచించింది. ప్రజల సమస్యలు పట్టకపోతే ఎలా అని ప్రశ్నించింది. శక్తిమంతమైన రాజ్యాలు కూడా కుప్పకూలడం తెలంగాణే చూసిందని వ్యాఖ్యానించింది. రాష్ట్ర సర్కార్‌‌ రూ. 30 వేల కోట్ల అప్పుల్లో ఉందని ఏజీ చెప్పగా.. అందులో 47 కోట్లు ఏపాటివని డివిజన్​ బెంచ్‌‌ ప్రశ్నించింది.