డెక్కన్ కిచెన్ కూల్చివేతపై హైకోర్ట్ సీరియస్

డెక్కన్ కిచెన్ కూల్చివేతపై హైకోర్ట్ సీరియస్

హైదరాబాద్ ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేతపై హైకోర్ట్ సీరియస్ అయ్యిది. కోర్టు విచారణ సమయంలో GHMC మాజీ కమిషనర్, ప్రొడ్యూసర్ సురేష్ బాబు గైర్హాజరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్ట్ స్టే ఆర్డర్ ఉండగా..డెక్కన్ కిచెన్ ని అధికారులు ఎలా కూల్చివేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఆదివారం రోజు... అప్పటికప్పుడు, డెక్కన్ కిచెన్ ని కూల్చివేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది.  హాలీడే రోజు ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎందుకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. ప్రతివాదులు అందరూ  కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది హైకోర్టు.

ప్రతివాదుల తీరుపై ప్రశ్నల వర్షం కురిపించింది హైకోర్టు. కూల్చివేత ఆర్డర్స్ ఎక్కడని హైకోర్టు ప్రశ్నించింది. కూల్చివేత జరిగే ముందు డిమోలిష్ ఆర్డర్స్ ఇచ్చారా...? అని ప్రశ్నించింది. అలాగే కూల్చివేత టైమ్ లో ఎంతమంది పోలీసులు అక్కడ ఉన్నారని ప్రశ్నించింది. ఈ కేసుతో కోర్టు ధిక్కరణ చేస్తే ఎలా ఉంటుందో రాష్ట్రంలోని ప్రతీ ఆఫీసర్ తెలుసుకోవాలని తెలిపింది హైకోర్టు.  అంతేకాకుండా కూల్చివేతలపై పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. కేసు తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. ఎల్లుండి GHMC మాజీ కమిషనర్ తో పాటు ప్రతివాదులు అందరూ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది హైకోర్టు.