ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా...

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా...

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇవాళ ( జూలై 8, 2024 ) విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను గురువారానికి ( జూలై 11, 2024 ) వాయిదా వేసింది హైకోర్టు.

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ హుజురాబాద్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.