- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: శామీర్‌పేట పోలీసు స్టేషన్‌కు 2025లో 7వ ర్యాంకును కేటాయించడంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. శామీర్‌పేట పోలీసు స్టేషన్‌కు ర్యాంకు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిబ్రవరిలో ఇచ్చిన వినతి పత్రంపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ లోకహిత సొసైటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ ఇ.వి. వేణుగోపాల్ సోమవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. పోలీస్స్టేషన్ పనితీరు సక్రమంగా లేదని, ఫిర్యాదులను స్వీకరించడంలోనూ అలసత్వం చూపుతున్నారని తెలిపారు. ఇరువాదనలను విన్న న్యాయమూర్తి.. కేంద్ర హోంశాఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, విజిలెన్స్ కమిషనర్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏసీబీ డీజీలకు నోటీసులు జారీ చేశారు. విచారణను ఈనెల 20కి వాయిదా వేశారు.
