నిరసన తెలపడం నేరం కాదు

నిరసన తెలపడం నేరం కాదు
  • టీవీవీ సభ్యులపై కేసు డిస్మిస్‌‌‌‌ చేసిన హైకోర్టు 

హైదరాబాద్, వెలుగు: శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం నేరమేమీ కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణ విద్యార్ధి వేదిక సభ్యులపై పెట్టిన కేసును డిస్మిస్‌‌‌‌ చేసింది. పౌర హక్కుల నేతలు ప్రొఫెస ర్‌‌‌‌ సాయిబాబా, వరవరరావును విడుదల చేయాలని కోరుతూ ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌ అంబేద్కర్‌‌‌‌ విగ్రహం వద్ద అనుమతి లేకుండా కొందరు 2010, మే 17న నిరసన వ్యక్తం చేశారు. అం దులో 13 మందిపై సైఫాబాద్‌‌‌‌ పోలీసులు కేసు ను నమోదు చేశారు. దీనిని కొట్టేయాలంటూ టీవీవీ సభ్యులు కొత్తపల్లి మహేశ్, తంగెళ్ల సూర్య, సాహితి, కొత్తపల్లి అనిల్, బంటు సాగర్‌‌‌‌ కుమార్  హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీంతో పిటిషనర్లపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ జస్టిస్‌‌‌‌ కె. సుజన బుధవారం తీర్పు చెప్పారు. పిటిషనర్లు శాంతి భద్రతలకు భంగం కలిగించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు