గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్ట్ సంచలన తీర్పు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్ట్ సంచలన తీర్పు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ సంచలన తీర్పు వెల్లడించింది. 2024, మార్చి 7వ తేదీ గురువారం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పిటీషన్ పై విచారించిన కోర్టు..  దాశోజు శ్రవణ్, కుర్ర సత్య నారాయణల ఎంపికను గవర్నర్ రద్దు చేయడాన్ని తప్పుబట్టింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై అభ్యంతరం ఉంటే.. ఫైల్ తిప్పి పంపించాలి తప్ప.. నియామకాన్ని కొట్టివేసే అధికారం గవర్నర్ కు లేదని తెలిపింది.  దాసోజు, సత్యనారాయణ నియమకాన్ని  పున: పరిశీలించాలని హైకోర్టు సూచించింది. MLCల పేర్లను మళ్లీ కేబినెట్ లో ప్రతిపాదించి గవర్నర్ కు పంపాలని తెలిపింది.  కొత్తగా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.

గవర్నర్‌‌‌‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సూచిస్తూ గత ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను 2023, సెప్టెంబర్‌‌‌‌ 19న గవర్నర్‌‌‌‌ తమిళిసై రిజెక్ట్​చేసిన విషయం తెలిసింది. ఆ ఉత్తర్వులను సవాల్​ చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు.

కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ ల నియమించింది. అయితే, ఈ  నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పిటిషన్ పై విచారణ తేలేంత వరకు ఎమ్మెల్సీల నియామకాలను ఆపాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించవద్దని మండలి చైర్మన్ ను ఆదేశించింది. దాంతో కోదండరామ్, అమీర్ అలీఖాన్ ల  ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది.