
రంగారెడ్డి, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్‌ఏలను రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వం వారి కోసం వివిధ శాఖల్లో 14,954 సూపర్న్యూమరరీ పోస్టులను సృష్టించింది. ఆ పోస్టుల్లో అర్హులైన వారిని జిల్లాల వారీగా సర్దుబాటు చేసే చర్యలు తీసుకుంటుంది. .రాష్ట్రంలో కరీంనగర్ తో పాటు తదితర జిల్లాల్లో వీఆర్ఏలకు అపాయింట్‌మెంట్ఆర్డర్లు కూడా అందజేశారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 888 మంది వీఆర్ఏలు ఉన్నారు. వారిలో 789 మందికి అపాయింట్‌మెంట్ఆర్డర్లు ఇచ్చేందుకు శుక్రవారం అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ గురువారం హైకోర్టు సర్దుబాటు ఉత్తర్వులను కొట్టివేయడంతో ఆర్డర్ల కోసం వచ్చిన వీఆర్ఏలు నిరాశకు గురయ్యారు. అయితే వారి అపాయింట్‌మెంట్ఆర్డర్లు ఎప్పుడు ఇస్తారో జిల్లా రెవెన్యూ అధికారులకు కూడా స్పష్టత లేదని, సోమవారం వరకు వెయిట్ చేయాలని తెలిపారు.