రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట

రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్ : డైరెక్టర్‌‌ రాంగోపాల్‌‌ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది. మియాపూర్‌‌ పీఎస్‌‌లో వర్మపై నమోదైన చీటింగ్ కేసు దర్యాప్తును నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. దిశ సినిమా తీసేందుకు వర్మకు.. శేఖర్ ఆర్ట్స్ ఓనర్ శేఖర్‌‌ రాజు రూ.56 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత చెల్లించలేకపోవడంతో .. అదే సినిమాను ఇంకెవరైనా తీయడానికి ముందుకొస్తే డబ్బులు వాపస్ ఇస్తానని వర్మ హామీ ఇచ్చాడని బాధితుడు పేర్కొన్నాడు. ఆ తర్వాత కంచర్ల అనురాగ్‌‌ సినిమా తీయగా.. శేఖర్‌‌ రాజును అసోసియేట్ ప్రొడ్యూసర్​గా తీసుకునేందుకు వర్మ ఓకే చెప్పారు. అయితే, వర్మ చెప్పిన సమయం దాటిపోవడం, పైగా ఆ సినిమాకు వర్మ నిర్మాత కాదని తెలియడంతో శేఖర్ రాజు మోసపోయినట్లు తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీనిని కొట్టేయాలని వర్మ హైకోర్టులో రిట్‌‌ దాఖలు చేయడంతో మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. తదుపరి విచారణ జూన్‌‌ 17కి వాయిదా పడింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చిందని వర్మ వెల్లడించారు. ఈ కేసు విచారణపై స్టే విధించిందని, కేసుకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తానని తెలిపారు. నా ప్రతిష్టకు భంగం కలిగించేలా శేఖర్ రాజును తనపై మియాపూర్ పీఎస్ లో కేసు నమోదు చేశాడని, గౌరవ తెలంగాణ హైకోర్టు ఈ కేసు విచారణపై స్టే విధించిందంటూ వర్మ ట్వీట్ లో తెలిపారు. 

ఆశ ఎన్ కౌంటర్ మూవీ.. యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2019 నవంబర్ హైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టర్ పై కొందరు దుండగులు హత్యాచారం చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ సినిమా చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. అనేక సార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఈ సంవత్సరం జనవరిలో రిలీజ్ అయ్యింది.
 

మరిన్ని వార్తల కోసం : -

ఆస్థాన కవిగా సోనూసూద్..పోస్టర్కు సూపర్ రెస్పాన్స్


కిరణ్ అబ్బవరం కొత్త మూవీ షురూ