నేటి (మే 07) నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు

నేటి (మే 07) నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు
  • అత్యవసర కేసుల విచారణకు వెకేషన్​ బెంచ్​ల ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు: హైకోర్టుకు గురువారం నుంచి జూన్‌‌ 5 వరకు వేసవి సెలవులను ప్రకటిస్తూ రిజిస్ట్రార్‌‌ జనరల్‌‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసర కేసుల విచారణ నిమిత్తం వెకేషన్‌‌ బెంచ్‌‌లు ఏర్పాటయ్యాయి. ఇందులో భాగంగా ఈ నెల 14, 21, 28, జూన్‌‌ 4వ తేదీల్లో ఈ బెంచ్‌‌లు కేసుల విచారణ చేపడతాయి. వాటికి 2 రోజుల ముందు ఫైలింగ్‌‌ చేయాల్సి ఉంటుంది. జస్టిస్‌‌ టి.మాధవీదేవి, జస్టిస్‌‌ జీఎం.మొహియుద్దీన్, జస్టిస్‌‌ ఇ.వి.వేణుగోపాల్‌‌ మొదటి రెండు వారాలు, జస్టిస్‌‌ నగేశ్‌‌ భీమపాక, జస్టిస్‌‌ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్‌‌ సుద్దాల చలపతిరావు తర్వాతి రెండు వారాల్లో కేసుల విచారణ చేపట్టనున్నారు. హెబియస్‌‌ కార్పస్, ముందస్తు బెయిల్, బెయిల్​దరఖాస్తులు, కూల్చివేతలు తదితర అంశాలపై మాత్రమే విచారణ జరగనుంది.