మే 21 నుంచి సరస్వతీ అంత్య పుష్కరాలు

మే 21 నుంచి సరస్వతీ అంత్య పుష్కరాలు
  • దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలను వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ తెలిపారు. ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించవచ్చని తెలిపారు. గురు గ్రహం మిథున రాశిలో ఉన్న కాలంలో పుష్కరాలు జరుగుతాయన్నారు.  గతేడాది మే 16న ఆది పుష్కరాలను నిర్వహించగా.. ఇప్పుడు గురు గ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే ముందు చివరి 12 రోజులు అంత్య పుష్కరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.