ఒమిక్రాన్పై హైకోర్టు కీలక ఆదేశాలు

ఒమిక్రాన్పై హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలకు, బార్లు, రెస్టారెంట్లకు అనుమతి ఇవ్వడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన న్యాయస్థానం ఒమిక్రాన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యూ ఇయర్ వేడుకలకు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో కంటైన్మెంట్, మైక్రో కంటైన్మంట్ జోన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోర్టు సూచించింది. రాష్ట్రంలో కోవిడ్ టెస్టులను పెంచడంతో పాటు సరిపడా బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ పరిస్థితులపై జనవరి 3 లోపు హైకోర్టు కు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 4 కి వాయిదా వేసింది. కోవిడ్ పై ఈనెల 21, 27 తేదీల్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని ఈ సందర్భంగా కోర్టుకు పిటిషనర్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారించింది. న్యూ ఇయర్ వేడుకల్ని నియంత్రించాలన్న ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడం లేదని న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. పబ్బులు, బార్లలో వేడుకల సమయం మరింత పెంచారని ఆరోపించారు. ఢిల్లీ, మహారాష్ట్ర తరహా ఆంక్షలు విధించాలన్న పిటిషనర్ల న్యాయవాదులు కోర్టును కోరారు.

దీంతో నూతన సంవత్సర వేడుకల నియంత్రణపై జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేిసంది. పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటాయని న్యాయస్థానం పేర్కొంది. న్యూ ఇయర్ వేడుకలపై ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిందని హైకోర్టు తెలిపింది. రాష్ట్రంలో టీకా ఫస్ట్ డోస్ 100 శాతం, రెండో డోస్ 66 శాతం పూర్తయిందని తెలిపింది హైకోర్టు.  మార్గదర్శకాలు ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి:

కేటీఆర్ కాన్వాయ్ అడ్డుకునేందుకు బీజేపీ యత్నం

భారత్‌లోనే ఉంటా :పాక్ టెర్రరిస్ట్ భార్య