భారత్‌లోనే ఉంటా: పాక్ టెర్రరిస్ట్ భార్య

భారత్‌లోనే ఉంటా: పాక్ టెర్రరిస్ట్ భార్య

ఉగ్రవాదులు ఎలా ఉంటారు? వారి జీవితం ఏంటి ? వాళ్ల ట్రైనింగ్ ఎలా జరుగుతుంది.? ఉగ్రవాదానికి మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలకు సంబంధించి మనం ఎన్నో కథనాలు విన్నాం రాశాం. అయితే ఉగ్రవాదుల కుటుంబాల పరిస్థితి ఏంటి? వారి తల్లిదండ్రులు ఎలా బతుకుతున్నారు? ఓ టెర్రరిస్ట్ చనిపోయిన తర్వాత అతని కుటుంబ పరిస్థితి ఏంటి ? అనేది మనలో చాలామంది ఆలోచించరు. అలా ఓ ఉగ్రవాదిని పెళ్లాడిన యువతి.. తాజాగా మీడియా ముందుకు వచ్చింది. భర్త మరణానంతరం తన పరిస్థితి ఎలా మారింది? తాను ఇప్పుడు ఎలా బతుకుతుందన్న విషయాల్ని వెల్లడించింది. ఈమె పేరు రజియా బీబీ.. కాశ్మీరి మహిళ. పాకిస్తాన్ ఉగ్రవాదిని పెళ్లాడింది. పెళ్లి అనంతరం భర్తతో కలిసి పాకిస్తాన్ వెళ్లిపోయింది. అయితే ఉగ్రవాది అయన భర్త చనిపోయాడు. భర్త మరణంతో పాక్ లోని హిజ్బ్ టెర్రరిస్ట్ గ్రూప్ వీరిని పట్టించుకోలేదు. దీంతో ఆమె జీవితం దుర్భరంగా మారింది. చివరకు  ఇండియా ఎలా అయినా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. 

దీంతో భారత్‌కు తిరిగి వెళ్లేందుకు కొంత డబ్బు జమ చేసింది రజియా. ఎట్టకేలకు ఇండియా చేరింది. ఇండియాకు వచ్చిన రజియా ఆనందం వ్యక్తం చేస్తోంది. తిరిగి మాతృ దేశానికి రావడం అనేది సరైన నిర్ణయమన్నారు. తన పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. తమ దేశ ప్రజల్ని ఏ మాత్రం పట్టించుకోని పాకిస్తాన్.. ఇక భారత్ నుంచి వచ్చిన వారి కోసం ఏం చేయగలదు? అంటూ రజియా అసహనం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ లో మానవత్వం లేదని ఆమె పేర్కొంది. ఇస్లాం పేరును దుర్వినియోగం చేస్తూ.. పాకిస్తాన్ కాశ్మీర్ యువకుల జీవితాల్ని నాశనం చేస్తోందని మండిపడింది రజియా. ఉగ్రవాదం పేరుతో యువకులు జీవితాలతో దయాది దేశం ఆడుకుంటోందని విమర్శించింది. ఇప్పుడు తన పిల్లలతో కలిసి సుఖంగా జీవిస్తున్నానని రజియా చెప్పుకొచ్చింది. పాకిస్తాన్‌ నుంచి కాశ్మీర్‌‌కు తిరిగొచ్చాక ఇప్పుడు రాత్రిళ్లు ప్రశాంతంగా కంటి నిండా నిద్ర పడుతోందని తెలిపింది రజియా.

రజియాను అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం.

ఒకవేళ ఇక్కణ్ణుంచి భారత మహిళ పాక్ వెళితే ఎలా చూసుకుంటారు?

రజియా: వాళ్లు అక్కడి మహిళలనే సరిగ్గా చూసుకోరు ఇక ఇక్కడివారి పట్ల మంచిగా ఎలా వ్యవహరిస్తారు.

పాకిస్తాన్‌లో మానవత్వం లేదా?

రజియా: పాక్‌లో మానవత్వమంటూ ఏదీ లేదు. నా దృష్టిలో అయితే అస్సలు లేదు.

ఇవి కూడా చదవండి:

ముంబైలో మొదటి ఒమిక్రాన్ మరణం

కశ్మీర్లో ఎన్ కౌంటర్: ముగ్గురు టెర్రరిస్టుల హతం