ముంబైలో మొదటి ఒమిక్రాన్ మరణం

ముంబైలో మొదటి ఒమిక్రాన్ మరణం

భారత్ లో కరోనా కలకలం కొనసాగుతోంది. మరోవైపు ఒమిక్రాన్ టెన్షన్ కూడా నెలకొంది. రోజురోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. దేశంలో ఒమిక్రాన్ మొదటి మరణం చోటు చేసుకుంది. తాజాగా మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఒమిక్రాన్ తో మృతి చెందాడు. 52 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. దీంతో అతడు గుండెపోటు రావడంతో చనిపోయాడు. డిసెంబర్ 28న అతను మరణించినట్లు వైద్య అధికారులు ప్రకటించారు. నైజీరియా నుంచి తిరిగి వచ్చిన అతను పింప్రీ చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని యశ్వంత్ చవాన్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ వ్యక్తి 13 సంవత్సరాలుగా మధుమేహంతో బాధపడుతున్నట్లు అధికారులు బులెటిన్​లో తెలిపారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కాని కారణాల వల్ల జరిగిన మరణంగానే పరిగణించింది.

మరోవైపు మహారాష్ట్రలో ఒమిక్రాన్  కేసులు రోజురోజకు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే.. వాణిజ్య రాజధాని అయిన ముంబైలో 190 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ముంబైకు చెందిన 141 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వీరికి ఎలాంటి ట్రావెల హిస్టరీ లేదు. మొత్తం 153 మందికి ఒమిక్రాన్ సోకితే.. అందులో కేవలం 12 మంది మాత్రమే విదేశాల నుంచి వచ్చినట్లు గుర్తించారు అధికారులు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 198 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 190 స్థానికులే.. కేవలం 8మంది మాత్రమే విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

కొవిడ్‌ బాధితుల కోసం మార్కెట్లోకి మోల్నుపిరవిర్ డ్రగ్

మహారాష్ట్రలో ఒక్క రోజే 198 ఒమిక్రాన్ కేసులు