- అడ్వకేట్ దాఖలు చేసిన పిటిషన్లపై..
- తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్
- ఫిబ్రవరి 26వ తేదిలోపు రిపోర్టు ఇవ్వాలని కోరిన కమిషన్
చైనా మాంజా వినియోగంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ కు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) నోటీసులు జారీ చేసింది. చైనా మాంజా వినియోగించకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. పతంగులకు చైనా మాంజా వినియోగం మనుషుల ప్రాణాలు తీస్తున్న క్రమంలో పలువురు అడ్వకేట్ లు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న HRC ఫిబ్రవరి 26లోగా మాంజా వినియోగంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో రిపోర్టు ఇవ్వాలని సీపీ సజ్జనార్ ను ఆదేశించింది.
పతంగుల ఎగురవేతకు చైనా మాంజా వినియోగంతో అటు పక్షులు, ఇటు మనుషుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది.గత పది రోజులుగా చైనా మాంజా కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
చైనా మాంజాతో బైకర్స్ కి, పక్షులకు ప్రాణాపాయం ఉందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. చైనా మాంజా వినియోగం తో ప్రమాదాలు పెరుగుతున్న క్రమంలో రాష్ట్రంలో కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. చైనా మాంజా అమ్మకం, వాడకంపై జీరో టోలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నారు. లక్షల విలువైన చైనా మాంజాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
