
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలో మే 24 నుంచి ఈ నెల 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి.
ఈ పరీక్షలకు ఫస్టియర్, సెకండియర్ కు చెందిన 4.26 లక్షల మంది హాజరయ్యారు. ఫలితాలను tgbie.cgg.gov.in లేదా results.cgg.gov.in వెబ్సైట్లో చూసుకోవాలని ఇంటర్ బోర్డు వెల్లడించింది.