ఇంటర్ రిజల్ట్స్: ఫస్ట్ ఇయర్ 63..సెకండియర్ 67 శాతం పాస్

ఇంటర్  రిజల్ట్స్:  ఫస్ట్ ఇయర్ 63..సెకండియర్ 67 శాతం పాస్

ఇంటర్మీడియట్ రిజల్ట్స్  ను విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 63.32 శాతం..సెకండ్ ఇయర్ లో 67.16 శాతం పాస్ అయ్యారని వెల్లడించారు. ఆగస్ట్ 1 నుంచి సప్లమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపారు. ఈ నెల 30 నుంచే  సప్లమెంటరీ ఎగ్జామ్స్, రీ కౌంటింగ్ ఫీజు కట్టుకోవచ్చాన్నారు. ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలే హవా  కొనసాగించారు. ఫస్ట్ ఇయర్ లో మొత్తం 4,64,892 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 2,94,378 పాసయ్యారు.  బాలికలు 72.33 శాతం, బాలురు 54.25 శాతం పాసయ్యారు. సెకండియర్ లో మొత్తం  4,42,895 మంది ఎగ్జామ్స్ రాయగా.. 2,97,458 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 75.33 శాతం బాలికలు,59.21 శాతం బాలురు పాసయ్యారు. ఫస్ట్ ఇయర్ లో అత్యధికంగా మేడ్చల్  జిల్లాలో 76 శాతం ఉత్తీర్ణత  సాధించగా.. అత్యల్పంగా   మెదక్  జిల్లాలో 40 శాతం పాసయ్యారు.  సెకండ్  ఇయర్ లో అత్యధికంగా  మేడ్చల్   జిల్లాలో   78 శాతం ఉత్తీర్ణత సాధించగా..అత్యల్పంగా   మెదక్  జిల్లాలో 47 శాతం ఉత్తీర్ణత సాధించారు

కరోనా కారణంగా మార్చిలో జరగాల్సిన ఇంటర్ పరీక్షలను మేలో నిర్వహించారు. మే 6వ తేదీ నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. మొత్తం 9 లక్షల 7 వేల 393 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారు. 70శాతం సిలబస్ తోనే పరీక్షలు జరిగాయి. వాస్తవానికి ఎగ్జామ్స్ పూర్తయిన నెల రోజుల్లోనే ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తామని ఇంటర్ బోర్డ్ గతంలో వెల్లడించింది. అయితే ఇంటర్ ఫలితాల విడుదల పలుసార్లు వాయిదా పడడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఎట్టకేలకు మంగళవారం విడుదల అవుతుండడంతో విద్యార్థుల ఆందోళనకు ఫుల్ స్టాప్ పడింది. ఫలితాలను http://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in, http://examresults.ts.nic.in వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.