దసరా సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు

దసరా సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు
  • ఈనెల 10న కాలేజీలు పునః ప్రారంభం: ఇంటర్మీడియట్ బోర్డు

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలలో ఉన్న జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు దసరా సెలువులు ప్రకటించింది. రేపటి నుంచి ఈనెల 9వ తేదీ వరకు దసరా సెలవులు పాటించాలని.. తిరిగి ఈనెల 10వ తేదీన కాలేజీలు పునః ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ... ప్రైవేట్, ఎయిడెడ్, కోఆపరేటివ్, గురుకుల జూనియర్ కాలేజీలు ఉత్తర్వుల మేరకు దసరా సెలవులు పాటించాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.