15 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్..  9 లక్షల 45 వేల మంది స్టూడెంట్స్..

15 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్..  9 లక్షల 45 వేల మంది స్టూడెంట్స్..

ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకటించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న ఎగ్జామ్స్ పై ఆయా జిల్లా కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని వసతులు కల్పించాలని.. పరీక్ష సమయం కంటే ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు మంత్రి. ఒత్తిడిని అధిగమించాలని.. ఆందోళన చెందొద్దని పిల్లలకు పిలుపునిచ్చారామె.

ఎండలు ఎక్కువగా ఉన్నాయని.. అందుకు తగ్గట్టుగానే పరీక్షా కేంద్రాల్లో మంచినీళ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు మంత్రి. చివరి నిమిషంలో టెన్షన్ పడకుండా.. అర గంట ముందుగానూ పరీక్ష కేంద్రానికి చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని.. దీని వల్ల ఒత్తిడి నుంచి బయటపడొచ్చని పిల్లలకు సూచించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు, భద్రతపై దృష్టి సారించాలని ఆదేశించారు.

 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల 45 వేల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కు హాజరవుతున్నారని.. హాల్ టికెట్లను వెబ్ సైట్ నుంచి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. ఆయా పరీక్షా కేంద్రాలు ఉన్న ప్రాంతాలకు.. ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని.. స్టూడెంట్స్ వినియోగించుకోవాలన్నారామె.