కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైంది : మంత్రి కేటీఆర్

కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైంది : మంత్రి కేటీఆర్
  • రాష్ట్రంలో 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఫ్రీ కరెంట్ ​ఇస్తున్నం: మంత్రి కేటీఆర్
  • తెలంగాణకు కేంద్రం నయా పైసా ఇయ్యలే 
  • ఎన్నో అంశాల్లో మద్దతిస్తున్నా ఫండ్స్​ ఇస్తలే.. విభజన చట్టంలోని హామీలనూ నెరవేర్చలేదని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు : ప్రపంచంలోనే లార్జెస్ట్​లిఫ్ట్​ఇరిగేషన్​ప్రాజెక్టు కాళేశ్వరం అని, దానితో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని, వాటికి 24 గంటల నాణ్యమైన కరెంట్​సరఫరా చేస్తున్నామన్నారు. ఎంసీఆర్​హెచ్ఆర్డీలో శుక్రవారం ఏర్పాటు చేసిన‌‌ అభ‌‌య్ త్రిపాఠి స్మార‌‌క ఉప‌‌న్యాసం కార్యక్రమంలో మంత్రి పాల్గొని ‘కొత్త రాష్ట్రం –  స‌‌వాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు. 1950 నుంచి 2014 వరకు దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయని.. 

దశాబ్దాల పోరాటం తర్వాత కేసీఆర్​నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. తెలంగాణకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నయా పైసా ఇవ్వలేదని మంత్రి విమర్శించారు. తాము ఎన్నో అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతిచ్చినా.. నీతి ఆయోగ్​సిఫార్సు చేసినా.. మోదీ సర్కారు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. స్టేట్​రీ ఆర్గనైజేషన్​యాక్ట్​లో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం సమగ్ర, సమీకృత, సమతుల్య అభివృద్ధి సాధించిందని అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూపాయి చెల్లిస్తే.. కేంద్రం 46 పైసలు మాత్రమే తిరిగి చెల్లిస్తున్నదన్నారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్​కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. ఐటీ సెక్టార్​లో బెంగళూరును హైదరాబాద్​దాటేసిందన్నారు.