ఐటీ ఉద్యోగాల్లో..బెంగళూరును దాటేశాం : మంత్రి కేటీఆర్

ఐటీ ఉద్యోగాల్లో..బెంగళూరును దాటేశాం : మంత్రి కేటీఆర్

హైదరాబాద్, వెలుగు :  ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటేశామని మంత్రి కేటీఆర్‌‌‌‌ తెలిపారు. పర్​క్యాపిట ఇన్‌‌కం, జీఎస్‌‌డీపీలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌‌గా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి, హైదరాబాద్ నగర అభివృద్ధిపై స్టడీ చేసేందుకు మహారాష్ట్రకు చెందిన 250 మంది రియల్ ఎస్టేట్ ప్రతినిధుల బృందం మూడ్రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చింది. శనివారం టీ హబ్‌‌లో మంత్రి కేటీఆర్​వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పనపై ఎక్కువగా దృష్టి పెట్టాం కాబట్టే పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయని ఆయన తెలిపారు. 

ఐటీ, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ రంగంలో భారీ పెట్టుబడులు సాధించామని చెప్పారు. వరుసగా రెండేండ్లుగా ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటేశామని, ఐటీ ఎగుమతుల్లో, ధాన్యం ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. అలాగే, టీఎస్ ఐపాస్‌‌ చట్టంతో 15 రోజుల్లోగానే పరిశ్రమలకు అనుమతులిస్తున్నామని, బిల్డింగ్‌‌లకు పర్మిషన్లు ఇచ్చేందుకు టీఎస్ బీపాస్ కూడా తీసుకొచ్చామని వెల్లడించారు. తమ ప్రభుత్వ పాలసీలను అనేక రాష్ట్రాలు వచ్చి స్టడీ చేశాయని, తెలంగాణ చేసిన కార్యక్రమాలను దేశం అనుసరిస్తోందని మంత్రి వెల్లడించారు. 

ALSO READ : సీడబ్ల్యూసీ నేతలకు.. తెలంగాణ వంటకాలతో ఫుడ్ మెనూ

పబ్లిక్ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ను పెంచుతున్నాం..

హైదరాబాద్ సిటీ విస్తరణకు అనుగుణంగా పబ్లిక్ ట్రాన్స్‌‌పోర్ట్ సిస్టంను పెంచే ప్రయత్నాల్లో ఉన్నామని మంత్రి కేటీఆర్‌‌‌‌ తెలిపారు. సిటీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డును కవర్ చేసేలా 415 కిలోమీటర్ల మేర మైట్రో రైల్ వ్యవస్థ ఏర్పాటు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఎస్సార్డీపీలో భాగంగా ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు, బ్రిడ్జిలను నిర్మించామని తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రారంభించిన కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రాం (సీఆర్ఎంపీ)ను ముంబైలో అమలు చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్ అవసరాలకు కరెంట్, తాగు నీటి సరఫరా వ్యవస్థలను విస్తృతం చేయనున్నామని వెల్లడించారు. దేశంలోనే వంద శాతం మురుగు నీటిని శుద్ధి చేసే నగరంగా హైదరాబాద్​మారబోతున్నదని చెప్పారు. దేశంలో ముంబై తర్వాత అత్యంత ఎత్తయిన భవనాలు ఉన్న సిటీగా హైదరాబాద్ నిలిచిందన్నారు. టీడీఆర్ విధానంతో రూ.5 వేల కోట్ల ప్రజా ధనాన్ని జీహెచ్ఎంసీ పొదుపు చేసిందన్నారు. 

దేశాన్ని నడిపిస్తున్నది నగరాలు, పట్టణాలే..

టీఎస్ బీపాస్‌‌ను ప్రారంభించే ముందు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారితో సీఎం కేసీఆర్ సమావేశమై చర్చించారని మంత్రి కేటీఆర్‌‌‌‌ చెప్పారు. స్లమ్‌‌లను అభివృద్ధి చేసేందుకు పక్కా ఇండ్లు నిర్మించి పంపిణీ చేశామని తెలిపారు. తనకు మహారాష్ట్రతో ప్రత్యేక అనుబంధం ఉందని, పుణేలో తాను చదువుకున్నానని కేటీఆర్‌‌‌‌ తెలిపారు. దేశంలో ఎక్కువ మంది గ్రామాల్లో నివసిస్తున్నారన్నది నిజమే.. కానీ దేశాన్ని నడిపిస్తున్నది మాత్రం నగరాలు, పట్టణాలే అనే విషయం గుర్తించాలని మంత్రి పేర్కొన్నారు. బుల్లెట్ ట్రైన్ కంటే స్పీడ్‌‌గా హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ ప్రతినిధుల బృందం అభినందించింది.