
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ ఆదివారం ( జులై 13 ) హైదరాబాద్ లోని ఉప్పల్ మేడిపల్లిలో ఉన్న తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి చేశారు జాగృతి కార్యకర్తలు.ఆఫీసులో సిబ్బందిపై దాడి చేసిన జాగృతి కార్యకర్తలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈక్రమంలో మల్లన్న గన్ మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుబడుతూ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు జాగృతి కార్యకర్తలు. ఈ క్రమంలో దాడికి దిగిన కార్యకర్తలు మల్లన్న ఆఫీసులోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మల్లన్న గన్ మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపాడు.దాడి సమయంలో తెలంగాణ జాగృతి కార్యకర్తకు గాయాలవ్వగా.. రాంనగర్ ఆసుపత్రికి తరలించారు. తీన్మార్ మల్లన్న క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు జాగృతి కార్యకర్తలు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘ్టనాస్థలికి చేరుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.ఈ క్రమంలో దాడిపై స్పందించిన మల్లన్న తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేసారని ఆరోపించారు. హత్యాయత్నాన్ని ఆపేందుకు తన గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారని అన్నారు మల్లన్న.