- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్
హైదరాబాద్, వెలుగు: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కులవివక్షతో పసిబిడ్డ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్‌చేశారు. ఆదివారం ఆమె నాగర్‌కర్నూల్ ఎస్పీ, బాధిత కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడారు. నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం విచారకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
జాతరకు వెళ్లిన రజక దంపతులు గణేశ్, మౌనిక, రెండు నెలల వారి పసి బిడ్డ, తల్లి, చెల్లిపై దాడి చేశారని, ఈ దాడిలో పాప ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పాప తల్లి, కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.
దాడికి కారణమైన నిందితులను తప్పించేందుకు పోలీసులు నామమాత్రపు కేసులు పెట్టి రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణ ఒగ్గు కథను ప్రపంచానికి చాటేలా తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేలా గాడ్స్ఇన్ ది వాయిస్ డాక్యుమెంటరీ కల్చరల్ ఫిల్మ్ఉందని కవిత అన్నారు. జి. కుమార స్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ‘గాడ్స్ఇన్ది వాయిస్’ టీజర్‌ను ఆమె విడుదల చేశారు.
