ఒకప్పుడు మన భాషను జోకర్లా పెట్టేటోళ్లు

ఒకప్పుడు మన భాషను జోకర్లా పెట్టేటోళ్లు

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడిందని సీఎం కేసీఆర్ అన్నారు. అస్తిత్వం, సంస్కృతి, భాషా పరిరక్షణ లాంటి వాటితోపాటు ముఖ్యమైనది నీళ్లు, నిధులు, నియామకాల ఏజెండానే అన్నారు. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణకే దక్కాలని ఉద్యమంలో పోరాడామన్నారు. హుడా భూములు అమ్మి వేరే ప్రాంతంలో ఖర్చు పెడుతున్నా.. అప్పుడు తెలంగాణ నేతలు ఎవరూ నోరుమెదపలేదన్నారు. పదవులు, ఇతరత్రా వాటి కోసం వాళ్లు మౌనం పాటించారని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక భాషా పరిరక్షణ జరిగిందన్నారు. ఇప్పుడు సినిమాల్లో తెలంగాణ భాష పెడితేనే సినిమా హీరోల చిత్రాలు బాగా హిట్ అవుతున్నాయని పేర్కొన్నారు. ఒకప్పుడు మన భాషను జోకర్ లా పెట్టేవారని.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. అలాగే తెలంగాణ సంస్కృతి అయిన బతుకమ్మ, బోనాలు, పోచమ్మ వైభవంగా జరుపుకుంటున్నామని వివరించారు. 

 

మరిన్ని వార్తల కోసం:

ఇకపై ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్

కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు ప్రభుత్వం గుడ్న్యూస్

మాకు రాజకీయాలంటే పెద్ద టాస్క్