హైదరాబాద్:పట్టణ స్థానిక సంస్థల్లో బిల్ వన్ సేవలు

హైదరాబాద్:పట్టణ స్థానిక సంస్థల్లో బిల్ వన్ సేవలు

హైదరాబాద్, వెలుగు: పట్టణ స్థానిక సంస్థల్లో పౌరులకు మరింత సులభమైన, పారదర్శక సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘బిల్ వన్’ సేవలను ప్రారంభించింది. శుక్రవారం సీడీఎంఏ కార్యాలయంలో మున్సిపల్ శాఖ కమిషనర్ టి.కె. శ్రీదేవి ఈ సేవలను ప్రారంభించారు. బిల్ వన్ ద్వారా ఆస్తి పన్ను, నీటి చార్జీలు, ట్రేడ్ లైసెన్స్ తదితర మున్సిపల్ బకాయిలన్నింటినీ ఒకే బిల్లులో చూపించి, ఒకేసారి చెల్లించే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. 

ప్రతి కుటుంబానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ కేటాయిస్తామని, ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నా వాటి బకాయిలన్నీ ఒకే డిమాండ్ నోటీసులో చూపిస్తామని చెప్పారు. దీంతో పరిపాలనా భారం తగ్గడంతో పాటు పన్నుల వసూళ్లు మరింత సులభమవుతాయని పేర్కొన్నారు. పౌరులందరూ ఈ సేవను వినియోగించుకోవాలని కోరారు