ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో.. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో.. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు స్పీడప్ అందుకున్నాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం పండింది.. ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు జరుగతున్నాయని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా ఉందన్నారు. ధాన్యం సేకరణ విషయంలో ప్రతిపక్ష బీఆర్ ఎస్  తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

రాష్ట్రంలో  కనీస మద్దతు ధరకే  అన్ని రకాల ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్.. ఎంఎస్ పీ ధరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు 16వేల కోట్ల రూపాయలు ఖర్చు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. రాష్ట్రంలో 143 లక్షల టన్నుల ధాన్యం పండితే.. ఇప్పటివరకు 73 లక్షల  టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామన్నారు. చివరి గింజ వరకు మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. 

యాసంగిలో  రాష్ట్ర ప్రభుత్వం 73 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది..అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం కేవలం 5 లక్షల ధాన్యమే కొనుగోలు చేస్తామని చెబుతోంది.. ఏటా తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోళ్లను తగ్గిస్తూ వస్తోంది. ధాన్యం కొనుగోళ్లు పెంచాలని  కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డితో కలిసి  కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోవడం లేదు.బీజేపోళ్లు ధర్నా చేసుడు కాదు.. ఢిల్లీకి వెళ్లి వడ్లను కొనాలను కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 

ధాన్యం కొనుగోళ్లకు  16వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేశామన్నారు మంత్రి ఉత్తమ్. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న చివరి  గింజ వరకు ధాన్యం  సేకరణ జరగుతుందన్నారు. ధాన్యం సేకరణలో 2వేల మిల్లులు పనిచేస్తున్నాయన్నారు. ధాన్యం తరలించేందుకు 13వేల వాహనాలు సిద్దంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో హమాలీల కొరత  ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ ధాన్యం కొనుగోలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారుమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 

బీఆర్ ఎస్ హయాంలో ఏడాదికి 15వేల ఇస్తే  కాంగ్రెస్ హయాంలో 49వేల కోట్లు ఇస్తున్నామన్నా రు మంత్రి.. తెలంగాణలో 60 లక్షల టన్నుల ధాన్యం కొంంటే.. ఏపీలో 24 లక్షలే కొన్నరని పోల్చి చెప్పారు.  ఇప్పటివరకు రూ.11వేల 50కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం.. రెండున్నరేళ్లలో  రూ.36వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. వడ్లను కొన్న 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. చివరి గింజ కొనేవరకు  కొనుగోలు కేంద్రాలు పనిచేస్తాయని, ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన 10వేల 214 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.